Connect with us

Blog

తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 2026: కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ పోస్టుల నోటిఫికేషన్

Published

on

Latest Telangana Outsourcing Jobs Recruitment 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జనవరి 12వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

▶️ తెలంగాణ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలను తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కరీంనగర్ నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండెంట్, కుక్ మరియు కిచెన్ బాయ్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత వివరాలు :

పోస్టులను అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, DMLT / Bsc MLT , BLISC ఒంటి విద్యార్హతలు మరియు అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు :

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల కరీంనగర్ నుండి విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కరీంనగర్ జిల్లా అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అప్లికేషన్ చివరి తేదీ :

అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 12-01-2026 తేదీలోపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు కమాన్ దాటిన తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంకు వెనుకవైపు గల మిత్ర ఎవెన్స్ నందు గల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, గణేష్ నగర్, డోర్ నెంబర్ 8-7-326/డి నందు అప్లై చేయాలి.

అప్లై చేయు విధానము :

అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు లేదా బయోడేటాకు అర్హత ధ్రువీకరణ పత్రాలు పైన గెజిటెడ్ అధికారి చేత అటేస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం వివరాలు :

ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు ముఖ్య గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.

▶️ Download Notification – Click here

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.