MHSRB CAS Specialist and MO Specialist Notification 2025

MHSRB CAS Specialist and MO Specialist Notification 2025

MHSRB CAS Specialist and MO Specialist Recruitment 2025 : తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1623 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ మరియు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్స్ అనే పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

✅ డిగ్రీ అర్హతతో బ్యాంక్స్ లో 750 ఉద్యోగాలు – Click here

MHSRB CAS & MO Specialists నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

MHSRB ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య :

  • MHSRB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1623 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • ఇందులో మల్టీ జోన్-1 లో 858 పోస్టులు , మల్టీ జోన్-2 లో 765 పోస్టులు ఉన్నాయి.

MHSRB CAS & MO Specialists ఉద్యోగాలకు అప్లై చేసే విధానం :

  • MHSRB విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 22 సాయంత్రం ఐదు గంటల లోపు సబ్మిట్ చేయాలి.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు :

  • సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా / DNB పూర్తి చేసి ఉండాలి.
  • తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.

వీరికి ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – Click here

వయస్సు వివరాలు :

  • 01-07-2025 తేది నాటికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ, ఎస్టి, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
  • విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
  • వీరితోపాటు ఎక్స్ సర్వీస్మెన్, NCC, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు అందరూ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 500/- చెల్లించాలి.
  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టి, బీసీ, ఈడబ్ల్యూఎస్, PH, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తప్ప మిగతావారు ప్రాసెసింగ్ ఫీజు 200/- రూపాయలు చెల్లించాలి.

జీతము వివరాలు :

  • TVVP ఉద్యోగాలకు 58,850/- నుండి 1,37,050/- వరకు పే స్కేల్ ఉంటుంది.
  • TGSRTC ఉద్యోగాలకు 56,500 – 3,000 – 1,31,00/- పే స్కేల్ ప్రకారం జీతం ఉంటుంది.

ఎంపిక విధానము వివరాలు :

  • ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
  • ఇందులో అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లు వరకు కేటాయిస్తారు. గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవానికి 20 పాయింట్లు వరకు కేటాయిస్తారు.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *