AP Mega DSC Merit List Released

AP Mega DSC Merit List Released

AP Mega DSC Merit List Download : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎదురుచూస్తున్న మెరిట్ జాబితాలను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ నందు పొందుపరిచింది.

మెరిట్ జాబితాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ? టీచర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి? విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు డీఎస్పీ పై ఏ విధమైన ప్రకటన చేశారు వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 AP Mega DSC Merit Lists Released :

  • మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ కొరకు నిర్వహించిన పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ వారు , శుక్రవారం రాత్రి మెరిట్ జాబితాలను విడుదల చేసింది.
  • అన్ని సబ్జెక్టులకు సంబంధించి , రాష్ట్ర , జోన్ , జిల్లా వారిగా ర్యాంకులను ప్రకటించారు.
  • ఇందులో భాగంగా ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ( PGT) మరియు ప్రిన్సిపాల్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లైట్లను వెబ్సైట్ లో పొందుపరిచారు.
  • తర్వాత మిగతా అన్ని పోస్టులకు సంబంధించి , మెరిట్ జాబితాలు వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

గ్రామ సచివాలయాల్లో 2778 ఉద్యోగాలు – Click here

🔥 Download AP Mega DSC Merit Lists :

  • మెరిట్ జాబితాలు డౌన్లోడ్ చేసుకొనేందుకు అధికారిక వెబ్సైట్ లో అవకాశం కల్పించారు.
  • అభ్యర్థులు DSC అధికారిక వెబ్సైట్ నందు వారి యొక్క లాగిన్ క్రెడిన్షియల్స్ ద్వారా లాగిన్ అయి , డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • జిల్లాల వారీగా డౌన్లోడ్ చేసుకుని , మీ ర్యాంక్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

🔥 Tomorrow’s certificate verification schedule of AP Mega DSC:

  • డీఎస్సీ మెరిట్ లిస్టు విడుదలైన నేపథ్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం అధికారిక షెడ్యూల్ రేపటిలోగా వెబ్సైట్లో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • 13 జిల్లాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు షెడ్యూల్ తయారీ పనిలో నిమగ్నమై ఉన్నారని తెలుస్తోంది.

🔥 పకడ్బందీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ :

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు షెడ్యూల్ అధికారికంగా ప్రకటించిన తర్వాత అభ్యర్థులను ఆ షెడ్యూల్ ప్రాప్తికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు పిలుస్తారు.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు జిల్లాల వారీగా అధికారులను బృందాలుగా ఏర్పాటు చేస్తున్నారు.
  • అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా , వెరిఫికేషన్ ప్రక్రియలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా వీలైనంత త్వరగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
  • ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.
  • 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున నియమించనున్నారు.
  • కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ కొరకు రెవెన్యూ అధికారి మరియు దివ్యాంగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు వైద్య శాఖాధికారి కూడా అందుబాటులో ఉంటారు.
  • ఎవరైనా ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ పోస్టులకు గాను ఎంపిక అయితే , వారు ముందుగా ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఎంపిక పూర్తి అయిన తర్వాత వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
  • జిల్లాలో గల సీనియర్ అధికారులను ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు ఇంచార్జీ లు గా నియామకం చేయనున్నారు.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం అభ్యర్థులు ఎప్పుడు , ఎక్కడ హాజరవ్వాలి ? ఏ సమయంలో హాజరవ్వాలి ? అనే అంశాలను అధికారికంగా తెలియజేస్తారు.

డిగ్రీ అర్హతతో 750 ఉద్యోగాలు – Click here

🔥 These are the documents required for AP Mega DSC certificate verification. :

అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిమిత్తం తీసుకు వెళ్లే ద్రోపత్రాలను ఉందిగా అధికారిక వెబ్సైట్లో వారి లాగిన్ నందు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

  • 1. 10 వ తరగతి సర్టిఫికేట్
  • 2. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
  • 3.బిఈడి / డిఈడి సర్టిఫికెట్స్
  • 4.నాల్గవ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • 5.కుల ధ్రువీకరణ పత్రం / ఈ డబ్ల్యూ సర్టిఫికెట్ ( సంబంధిత వర్గాల వారు )
  • 6. ఆధార్ కార్డ్
  • పైన పేర్కొన్న అన్ని ధ్రువపత్రాల పై గెజిటెడ్ అధికారి సంతకంతో తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
  • 7. TET మార్క్స్ మెమో
  • 8. డీఎస్సీ అప్లికేషన్
  • 9. డీఎస్సీ స్కోర్ కార్డ్
  • 10.ఇతర ధ్రువపత్రాలు ఏమైనా ఉంటే అవి కూడా
  • మొత్తం సర్టిఫికెట్లు కూడా మూడు సెట్ల జిరాక్స్ కాపీలు మరియు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు తీసుకుని వెళ్లాలి.

🔥 గెజిటెడ్ అధికారి ఎవరు ? :

  • అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన కొరకు తీసుకువెళ్లే సర్టిఫికెట్ల పై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి.
  • మండల రెవెన్యూ అధికారి ( MRO ) , మండల విద్యాశాఖ అధికారి ( MEO ) , మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( MPDO) , మండల వ్యవసాయ అధికారి ( MAO ) , జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్లు , గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్లు , గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు , లేదా పై స్థాయి అధికారులు అనగా గ్రీన్ ఇంక్ పెన్తో సంతకం చేసే అధికారం కలిగి ఉన్నవారు గజిటెడ్ అధికారులుగా గుర్తించబడతారు.
  • వీరి చేత అభ్యర్థులు వారి యొక్క ధ్రువపత్రాల కాపీలపై సంతకం చేయించుకుని , స్టాంపు మరియు డేట్ వేయించుకోవాలి.
  • పై మూడింటిలో ఏవి లేకపోయినా గెజిటెడ్ అధికారి ధృవీకరణ పూర్తి కానట్లుగా పరిగణిస్తారు.

🔥ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి నారా లోకేష్ :

  • ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ పై నిర్వహించిన సమీక్షలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
  • రాష్ట్రంలో ఇకనుండి ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని , నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపడతామని మంత్రి తెలిపారు.
  • 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కొరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి , విజయవంతంగా ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.

✅ Download Merit Lists – Click here

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *