తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల అభ్యర్థులకు గుడ్ న్యూస్! తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఈరోజు అధికారికంగా అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేయబడింది. ఈ ప్రొవిజనల్ లిస్ట్ కోసం అభ్యర్థులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. 2024 లో 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి MHSRB నుండి నోటిఫికేషన్ నెం.4 విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు మొత్తం 42,244 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 23-11-2024 తేదిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 40,423 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష జరిగిన తర్వాత 26-11-2024 తేదీన ప్రాథమిక కీ ను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం 05-05-2025 తేదిన ఫైనల్ కీ విడుదల చేసి అభ్యర్థులకు నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్కులతో ఫలితాలు విడుదల చేశారు.
20-08-2025 తేదిన అభ్యర్థులు వివరాలతో కూడిన ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఇందులో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించారు. అనగా అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, జెండర్, డేట్ అఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ స్టడీ, అభ్యర్థి స్థానిక అభ్యర్థి ? కాదా? , అభ్యర్థి కమ్యూనిటీ, గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేశారా లేదా ? పనిచేస్తే ఎన్ని రోజులు పని చేశారు ? వారు గిరిజన ప్రాంతాల్లో పనిచేశారా ? పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశారా ? , అభ్యర్థి మెడిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అవునా కాదా , తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారా లేదా ?, విద్యార్హత, నార్మలైజేషన్ చేసిన తర్వాత అభ్యర్థికి వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులు మరియు కంప్యూటర్ ఆధారత పరీక్షలో వచ్చిన మార్కులు కలిపి మొత్తం మార్కులు మరియు రిమార్క్స్ వివరాలు ఈ ప్రొవిజనల్ లిస్టులో వెల్లడించారు.
రోజుల లిస్టులో వెల్లడించిన వివరాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వచ్చిన మార్కులు మరియు వెయిటేజీ మార్కులు మాత్రమే బుడ్డ అధికారులు వెరిఫికేషన్ చేశారు . మిగతా వివరాలు వెరిఫికేషన్ చేయలేదు. కాబట్టి షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు వెరిఫికేషన్ సమయంలో ఇవన్నీ వెరిఫై చేస్తారు.
తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్టు పైన అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఆగస్టు 26వ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ మధ్య మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో అభ్యర్థి తమ వివరాలతో లాగిన్ అయ్యి అభ్యంతరాలు నమోదు చేయొచ్చు. అభ్యంతరాలు నమోదు చేసే సమయంలో అభ్యర్థి అన్ని వివరాలు సరిగ్గా చూసి నమోదు చేయాలి. అభ్యర్థి అభ్యంతరాలు నమోదు చేసే సమయంలో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సింగిల్ పిడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి.
హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్ వచ్చిన తీర్పును అనుసరించి అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుందని వెబ్ నోటీసులు తెలియజేశారు.
✅ Official Website – Click here