Punjab and Sind Bank LBO Notification 2025 : దేశంలో ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుండి 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం పోస్టులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 పోస్టులు , తెలంగాణ రాష్ట్రంలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 20వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ లోపు అప్లై చేయాలి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండే పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా తెలుగు భాష వచ్చి ఉండాలి.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు నుండి విడుదలైన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీరు తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి. ఆర్టికల్ చివరిలో మీకోసం పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి లింక్స్ ఇవ్వబడినవి.
Punjab and Sind Bank Local Bank Officer Recruitment Organisation :
- ఈ ఉద్యోగాలకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత ఉన్నవారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతుంది.
Punjab and Sind Bank Local Bank Officer Total Vacancies :
- మొత్తం 750 పోస్టులు భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Punjab & Sindh Bank LBO Salary :
- బేసిక్ పే 48,480/- రూపాయలతో పాటు ఇతర అలవెన్స్‌లు వర్తిస్తాయి.
Punjab and Sind Bank LBO Educational Qualification :
- ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి..
✅ ఇంటర్ అర్హతతో 1121 ఉద్యోగాలు భర్తీ – Click here
Experience Details :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లేదా రూరల్ బ్యాంక్స్‌లో
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లేదా రూరల్ బ్యాంక్స్ లో ఆఫీసర్ క్యాడర్లో కనీసం 18 నెలలు పనిచేసిన అనుభవం ఉండాలి.
Age Details :
- నోటిఫికేషన్ లో తెలియజేసిన వివరాలు ప్రకారం 01-08-2025 తేదీ నాటికి కనీసం 20 సంవత్సరాలు నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- ఎస్సీ , ఎస్టి అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది. PWD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
Selection Process :
- అప్లై చేసిన అభ్యర్థులకు పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
Examination Center Details :
- దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం విజయవాడ లేదా గుంటూరులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
Application Fee Details :
- SC, ST, PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-
- General, EWS, OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 850/-
- అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించే సమయంలో Applicable Tax మరియు Payment Gateway Charges అదనంగా చెల్లించాలి..
Exam Date Details :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి అక్టోబర్ నెలలో పరీక్ష నిర్వహించబోతున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించారు.
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి..
Download Notification – Click here