7th, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో ఇన్ స్ట్రక్టర్ & ఆయాల ఉద్యోగ నోటిఫికేషన్
TS Govt Pre Primary School Instructor & Helper Notification 2025 Apply Now : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 41 పాఠశాలలు ఎంపిక కాగా, ప్రభుత్వం ఆయా స్కూళ్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ స్ట్రక్టర్, ఆయా పోస్టులకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

తాత్కాలిక పద్ధతిలో నియామకం
తెలంగాణలో 2025 -26 విద్యా సంవత్సరంలో జిల్లాలో 41 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించనున్నారు. తాత్కాలిక పద్ధతిలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
విద్యా అర్హత : ఇన్స్ట్రక్టర్ ఇంటర్మీడియెట్ & ఆయా ఏడో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 18 నుంచి 44 ఏళ్ల లోపు వారు ఈ నెల 25లోగా ఆయా పాఠశాలలో 41 స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
ఈ నెల 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం. దరఖాస్తు చేసుకోల్సి ఉంటుంది. ఆయాకు రూ.6వేలు, ఇన్స్ట్రక్టర్కు రూ.8వేలు చెల్లించనున్నారు.
ఎంపికైన పాఠశాలలు ఇవే..
ఆసిఫాబాద్ మండలంలో చిలాటిగూడ, ఉస్మానియా మజిద్ పాఠశాలలు ప్రీప్రైమరీ బోధనకు ఎంపికయ్యాయి. అలాగే బెజ్జూర్ మండలంలో పాపన్ పేట్, బెజ్జూర్, కుకుడ, సలుగుపల్లి, చింతనమానెపల్లిలో దిందా, డబ్బా, రుద్రాపూర్, దహెగాంలో ఇట్యాల, కుంచవెల్లి, హత్తిని, గిర్రె, దహెగాం, జైనూర్లో జామిని. కాగజ్నగర్ లో ఎఫ్ క్వార్టర్స్ స్కూల్, అనుకోడ, గన్నారం, నజ్రూల్నగర్, చింతగూడ, కాగజ్నగర్ వార్డునం. 12 పిఎస్ స్కూల్, కెరమెరిలో ధనోరా, గోయగాం, సావరేఖేడా, కౌటాలలో గుండాయిపేట్, ముత్తంపేట్, బండలెట్టి, పెంచికల్ పేట్లో కొండపెల్లి, చేడ్వాయి, రెబ్బెనలో రెబ్బెన ఎ స్సీ కాలనీ, గంగాపూర్, సిర్పూర్(టి)లో భూపాల పట్నం, లోనవెల్లి, గంగాయిగూడ, మాల్గూడ, చింతకుంట, గంభీరావు పేట్, తిర్యాణిలో మాలనంది, వాంకిడిలో కొమాటిగూడ, గోయగాం, ఖిరిడి పాఠశాలలు ఎంపికయ్యాయి.

ప్రీప్రైమరీ బోధకుడు/ఆయా ఎంగేజ్‌మెంట్ కోసం దరఖాస్తుదారుల నుండి సేకరించాల్సిన పత్రాలు
1) దరఖాస్తు ఫారమ్
2) ఇంటర్ మెమో
3) 10వ మెమో
4) బోనోఫైడ్/స్టడీ సర్టిఫికేట్
5) ఆధార్ కార్డ్
6) నివాసం/స్థానికత/నేటివిటీ సర్టిఫికేట్ (తహశీల్దార్ జారీ చేసినది).