వీరికి ఒకేసారి పీఎం కిసాన్ పథకం నిధులు 18,000/- జమ చేస్తారు

వీరికి ఒకేసారి పీఎం కిసాన్ పథకం నిధులు 18,000/- జమ చేస్తారు

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలియచేసింది. రైతుల ఖాతాలలో 18,000/- రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపింది. పీఎం కిసాన్ పథకం (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన) ద్వారా ఈ లబ్ది చేకూర్చాలి అని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అందించే ఈ లబ్ది కొరకు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన – Click here

🔥 ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) వివరాలు :

  • కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం చేసేందుకు గాను డిసెంబర్ 01 , 2018 వ సంవత్సరం నుండి అమలు లోకి తెచ్చింది.
  • భూమి కలిగిన రైతులు మరియు వారి కుటుంబాల కి ఆర్థిక మద్దతు కల్పించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.
  • పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000/- రూపాయలు చొప్పున అందిస్తారు. ఇందులో భాగంగా సంవత్సరానికి మూడు విడతల్లో 2000/- రూపాయలు చొప్పున నగదు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు.
  • ఇటీవల ఈ పథకం ద్వారా 20 వ విడత నగదును 2,000/- రూపాయలను ఆగస్టు 02 వ తేదీన కేంద్ర ప్రభుత్వం జమ చేసింది.

ఇక ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – Click here

🔥 వీరికి మరికొద్ది రోజులలో 18,000/- జమ :

  • కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది.
  • పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉండి , డబ్బులు జమ కాని రైతులకు వాయిదా వున్న బకాయిల మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది.
  • ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 11వ విడత తర్వాత నుండి 20 వ విడత వరకు వివిధ కారణాల వలన నగదు జమ కాని రైతులకు ఒకేసారి 18,000/- రూపాయలు జమ చేస్తారు.
  • తర్వాత విడత నగదు జమ అనగా 21వ విడత నగదు ఈ పెండింగ్ బకాయిలు నిధులు విడుదల చేసిన తర్వాత మాత్రమే జమ చేస్తారు.
  • రైతులు ఆధార్ సీడింగ్ , E – KYC , ఇతర వివిధ పెండింగ్ అంశాలు పూర్తి చేసిన తర్వాత వారికి నగదు జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి రామ్ నాథ్ ఠాగూర్ గారు తెలియచేసారు.

🔥ఎవరు అర్హులు & ఎలా పొందాలి ? :

  • రైతులు ఎవరైతే 12 వ విడత నుండి ఇప్పటి వరకు వివిధ కారణాల కారణంగా ఈ పథకం ద్వారా లబ్ది పొందలేదో వారు అర్హత కలిగి ఉంటారు.
  • వ్యవసాయ మంత్రిత్వ శాఖ వీరి జాబితాలను రాష్ట్రాలకు పంపించి , సంబంధిత అధికారుల చేత లబ్ధిదారులను గుర్తిస్తుంది.
  • వీరికి లబ్ది ఎందుకు చేకూరడం లేదో అన్న అంశాన్ని తెలియచేసి , పెండింగ్ అంశాలను పూర్తి చేస్తుంది.
  • EKYC పూర్తి కాని వారికి EKYC నమోదు , బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ పూర్తి కాని వారు NPCI లింకింగ్ మరియు ల్యాండ్ కి ఆధార్ లింక్ కాని వారు ల్యాండ్ కి లింక్ చేయడం వంటి వివిధ సాంకేతిక అంశాలను పూర్తి చేసుకోవాలి.
  • అధికారులు ఇక షెడ్యూల్ ప్రాప్తికి అన్ని అంశాలు పూర్తి చేసి , ప్రభుత్వానికి నివేదించిన తర్వాత అర్హత కలిగిన వారికి నగదు జమ అవుతుంది.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *