ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఉన్న తల్లికి వందనం పథకం 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు 12 వ తేదీన విడుదల చేసిన ప్రభుత్వం , విడతల వారిగా లబ్ధిదారులకు నిధులు జమ చేస్తుంది.
✅ గ్రామ, వార్డు సచివాలయాల్లో 2778 జాబ్స్ భర్తీ – Click here
🔥 తల్లికి వందనం నిధులు విడుదల
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నిన్న విద్యా శాఖ పై నిర్వహించిన సమీక్ష లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
- తల్లికి వందనం పథకం చివరి విడత నిధులు కొరకు 325 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
- పెండింగ్ ఉన్న దరఖాస్తులను ఆమోదిస్తూ ఈ నిధులు విడుదల చేశారు.
🔥 తల్లికి వందనం అర్హత జాబితాలు చెక్ చేసుకోండి
- తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాలు అప్డేట్ కాబడ్డాయి.
- ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అర్హుల , అనర్హుల జాబితాను అప్డేట్ చేసింది.
- ఇందులో భాగంగా మిస్ అయిన ఇంటర్మీడియట్ 1st ఇయర్ & ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లు ను లిస్ట్ నందు అప్డేట్ చేయడం జరిగింది.
- అడ్మిషన్లు ప్రక్రియ లో భాగంగా కొంత మంది విద్యార్థుల పేర్లు మిస్ అయ్యాయి అన్న కారణంతో జాబితాలు అప్డేట్ చేసి , సచివాలయం లో ప్రదర్శించారు.
- లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది సంప్రదించి , అర్హుల జాబితాను చెక్ చేసుకోవచ్చు.