Blog
Federal Bank Office Assistant Recruitment 2026: 10వ క్లాస్ అర్హత & Notification Details
దేశవ్యాప్తంగా ఉన్న ఫెడరల్ బ్యాంకుల్లో పని చేయడానికి పదవ తరగతి అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. సొంత రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
ఫెడరల్ బ్యాంకు నుండి విడుదలైన ఉద్యోగుల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఫెడరల్ బ్యాంక్ |
| పోస్ట్ పేరు | ఆఫీస్ అసిస్టెంట్ |
| వయస్సు | 18 నుండి 20 సంవత్సరాలు |
| అర్హతలు | పదవ తరగతి |
| లాస్ట్ డేట్ | 8th జనవరి, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఫెడరల్ బ్యాంక్ నుండి విడుదలైన ఆఫీస్అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అర్హులు. డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకూడదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఫెడరల్ బ్యాంకు నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు
అప్లికేషన్ ఫీజు:
ఫెడరల్ బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది ఆన్లైన్ ఫీజులను చెల్లించాలి.
- జనరల్ / Others : ₹500/-
- SC, ST అభ్యర్థులకు : ₹100/- ఫీజు చెల్లించాలి
ఎంపిక విధానం:
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు నిర్వహిస్తారు
- పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
- సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
ఎంత శాలరీ ఉంటుంది:
ఫెడరల్ బ్యాంక్ ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ₹37,800/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా బ్యాంకు వారు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
క్రింది తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | డిసెంబర్ 30, 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆకరు తేదీ | జనవరి 8, 2026 |
| రాత పరీక్ష తేదీ | ఫిబ్రవరి 1, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ pdf మరియు అప్లై linkn ద్వారా గడువులోగా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
బ్యాంకు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.
