Connect with us

Blog

TS District Court Recruitment 2026: 10వ క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు – Written Exam లేకుండా అవకాశం

Published

on


తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రిన్సిపల్ డిస్ట్రబ్ అండ్ సెక్షన్స్ కోడ్ నుండి కాంట్రాక్టు విధానంలో హెడ్ క్లర్క్, ఆఫీసు సబర్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో నిర్ణయిత గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలి. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన సమాచారం:

తెలంగాణ జిల్లా కోర్టు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోర్ట్
పోస్ట్ పేరు హెడ్ క్లర్క్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టులు
అర్హతలు పదవ తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత
వయస్సు 18 నుండి 34 సంవత్సరాలు
లాస్ట్ డేట్ జనవరి 12, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

తెలంగాణ జిల్లా కోర్టు నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి అర్హత లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్ సి, ఎస్ టి, ఓ బి సి, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.





Income Tax Dept లో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Income Tax Dept. Jobs Notification 2026 | Full details

అప్లికేషన్ ఫీజు ఎంత?:

అభ్యర్థులు ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు

ఎంపిక విధానం?:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా గడువు లాగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించాలి
  2. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది

ఎంత శాలరీ ఉంటుంది?:

పోస్టులను అనుసరించి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹15,600/- నుండి ₹40,000/- వరకు సాలరీస్ ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు

ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ జిల్లా కోర్టు కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ ని పోస్ట్ ద్వారా పంపించాలి. నేరుగా దరఖాస్తులు చేసుకుంటే అవి అంగీకరించబడవు.



సైనిక్ స్కూల్లో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతతో Govt జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ 12th డిసెంబర్, 2025
దరఖాస్తు స్వీకరణ ఆఖరి తేదీ 12th జనవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసినవారు అన్ని అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి.

Notification & Application Form

Official Website

తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.



AP విద్యాశాఖలో 424 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP EdCIL Notification 2026 | Full Details

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2017 Zox News Theme. Theme by MVP Themes, powered by WordPress.